NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం నుంచి ఇవాళ ఉదయం 11:30 నిమిషాలకు సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రారంభమవుతుందని మండలాభివృద్ధి అధికారి లక్ష్మారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు యువకులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.