WNP: పుష్య మాస అమావాస్య సందర్భంగా వనపర్తిలోని రాజనగరం విశ్వక్సేన గోశాలల్లో ఈ నెల 18న 1509వ మహాలక్ష్మి ధన్వంతరి యాగాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు గోశాల వ్యవస్థాపకుడు సౌమిత్రి రామాచార్యులు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 300 గోవుల మధ్యలో యాగాలు ప్రారంభమవుతాయన్నారు. మ.1:00 గంటలకు అన్నదాన ప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు.