మంచిర్యాల జిల్లాలోని ఒక కార్పొరేషన్, 4 మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. కలెక్టర్ కుమార దీపక్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. రిజర్వేషన్లు మారడంతో పలువురు మాజీ కౌన్సిలర్ల ఆశలు గల్లంతవగా, అనుకూలించిన చోట అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రకటనతో జిల్లాలో ఎన్నికల ఉత్కంఠకు తెరపడి, రాజకీయ సందడి మొదలైంది.