ఆసిఫాబాద్ జిల్లా స్థాయి అధికార పీఠాలపై మహిళలే ఉండటంతో, ఇకపై జిల్లా పాలన పగ్గాలు పూర్తిగా మహిళల చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికే జిల్లా SPగా నితికా పంత్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్గా శ్రద్ధ శుక్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు కలెక్టర్గా పనిచేసిన వెంకటేశ్ దోత్రే బదిలీ కావడంతో నూతన కలెక్టర్గా మరో మహిళా అధికారి హరిత బాధ్యతలు చేపట్టనున్నారు.