BDK: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రామయ్య నిత్య కళ్యాణం వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మేళ తాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చి బేడా మండపంలో కొలువు తీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్య వాచనం అనంతరం కంకణ ధారణ జరిపి కళ్యాణం నిర్వహించారు.