ADB: ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో మెస్రం వంశీయుల పుణ్యక్షేత్రం నాగోబా దేవత వద్ద ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నాగోబా జాతర సందర్బంగా సోమవారం నుంచి 22వ తేదీ వరకు కబడ్డీ, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బద్రీనాథ్, మెస్రం ఇంద్రు తెలిపారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులు అధికసంఖ్యలో హాజరుకావాలని వారు కోరారు.