SRD: నారాయణఖేడ్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా స్థాయి తనిఖీ బృందం శనివారం సందర్శించారు. ఈ మేరకు పాఠశాలలోని పలు రికార్డ్స్, ప్రశ్న పత్రాలు, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం స్థానిక హెచ్ఎంతో సమావేశమై విద్యా బోధన సామర్థ్యాలపై సూచనలు ఇచ్చారు. విద్యార్థుల అభ్యాసన అభివృద్ధి పెంచేందుకు కూడా పలు అంశాలను తెలిపారు.