WGL: తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి అభివృద్ధి చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. చెన్నారావుపేట మండలం బాపునగర్ జీపీ పరిధిలో జరిగిన బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో మంజూరు చేసిన బీటీ రోడ్లను ప్రస్తుత ఎమ్మెల్యే రద్దు చేస్తున్నారని విమర్శించారు.