NZB: ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్‌లోని ఎస్సీ కాలనీ 9వ వార్డులో నూతనంగా మంజూరైన డ్రైనేజీ నిర్మాణ పనులను శనివారం గ్రామ సర్పంచ్ పురమల్ల వినోద్ కుమార్, ఉప సర్పంచ్ షేక్ బాబా ప్రారంభించారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.