NTR: దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడలో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం ఈనెల 19న (సోమవారం) ఉదయం 7 గంటల నుంచి మహామంటపం 6వ అంతస్తులో నిర్వహించనున్నట్లు ఆలయ EO శీనానాయక్ తెలిపారు. దేవస్థానం వెబ్సైట్ ద్వారా ముందుగా ఆన్లైన్లో నమోదు చేసుకున్న సేవాదారులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆయన పేర్కొన్నారు.