KDP: రైతుల ముఖాల్లో ఆనందం చూడటమే తన లక్ష్యమని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పేర్కొన్నారు. శనివారం చక్రాయపేటలో ఆయన టీడీపీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాలేటి వాగు డ్యాం నిండటంవల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.