VZM: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం కనుమ పండుగను కుటుంబ సమేతంగా గంట్యాడలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి తండ్రి కొండపల్లి కొండలరావు, చిన్నాన్న మాజీ MLA కేఏ నాయుడు పండుగ వేడుకలలో పాల్గొన్నారు. పండగ వేడుకల అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆయన సతీమణి లక్ష్మి సింధు తమ బందువులతో కలిసి తాటిపూడి రిజర్వాయర్లో బోటు షికారు చేశారు.