SRD: షబ్-ఏ-మెహరాజ్ అంటే అధిరోహణ (పైకి వెళ్లడం) అని, ఈ రాత్రి మహమ్మద్ ప్రవక్త భూమి నుంచి స్వర్గానికి అధిరోహించారని ఇమామ్ నయ్యర్ అజాం తెలిపారు. కంగ్టి మండలం తడ్కల్ మసీదులో ఆయన ప్రవచనం చేశారు. ఈ పవిత్ర రాత్రి సందర్భంగా ముస్లిం సోదరులు అల్లాహ్కు మహమ్మద్ ప్రవక్త ద్వారా ఐదు సార్లు నమాజ్ అర్పించారని పేర్కొన్నారు. అలాగే మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో నడవాలని ఆయన సూచించారు.