SRD: జిన్నారం మున్సిపల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ఆరవ రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 146 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయాన్నే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవడంతో విద్యార్థులతో సందడి వాతావరణం నెలకొంది.