కోనసీమ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 10న అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం మండలం బట్నవెల్లిలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తూరు శ్రీనివాస్ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఉపాధి హామీ పథకం కూలీలతో షర్మిల ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకుంటారని వివరించారు.