SRPT: గరిడేపల్లి మండలంలోని సుభాష్‌నగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఒకేరాత్రి 20 వ్యవసాయ బోరు మోటార్ల కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. లక్ష వరకు ఉంటుందని బాధిత రైతులు గాదె మల్లారెడ్డి, జానపాటి శంకర్, కుసుమ సైదిరెడ్డి తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు మంగళవారం సాయంత్రం ఫిర్యాదు చేయగా, దర్యాప్తు ప్రారంభించారు.