ELR: గణపవరం మండలంలోని పలు గ్రామాల్లో కోడిపందేల స్థావరాలపై ఎస్సై ఆకుల మణికుమార్ నేతృత్వంలో శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. గణపవరం, మొయ్యేరు, కేశవరం, జల్లి కొమ్మర తదితర ప్రాంతాల్లో పందేల కోసం ఏర్పాటు చేసిన బరులను తొలగించి, టెంట్లను నేలకూల్చారు. నిబంధనలు అతిక్రమించిన 31 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.