రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరీ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించినప్పుడు వారిని ఓపెన్ కేటగిరి కిందే సర్ధుబాటు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ‘రిజర్వేషన్ లేని ఓపెన్ కేటగిరీ అన్నది రిజర్వేషన్ వర్తించని వర్గాల కోసం ఏర్పాటు చేసిన కోటా కాదు. అది ప్రతిభ మాత్రమే’ అని తెలిపింది. అలాంటి వారిని ఓపెన్ కేటగిరీ అభ్యర్థిగా పరిగణించాలని పేర్కొంది.