ELR: కుక్కునూరులోని విద్యుత్తు కార్యాలయ కాలనీలో ఏఐయూకేఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి గౌస్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టంలో మార్పులు, నూతన విత్తన చట్టం వల్ల రైతులకు, కూలీలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వీటిని రద్దు చేసే వరకు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.