BHNG: గ్రామాలు అభివృద్ధి చెందుతనే దేశం అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి జహంగీర్ అన్నారు. శుక్రవారం భువనగిరిలోని సుందరయ్య భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎండి జహంగీర్ హాజరై మాట్లాడారు.