PLD: నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో గురువారం సంక్రాంతి కోలాట ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ హాజరై మహిళలను అభినందించారు. మామిళ్ళపల్లి వాసు సమకూర్చిన రూ.20 వేల విలువైన టేకు కోలాట కర్రలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. మహిళల ఉత్సాహంతో గ్రామంలో పండుగ శోభ వచ్చిందని, ఇలాంటి కార్యక్రమాలు ఐకమత్యాన్ని పెంచుతాయని అన్నారు.