CTR: రొంపిచర్లకు సమీపంలోని కోళ్ల ఫారంలో పనిచేస్తున్న యువకుడు గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. కలకత్తా నుంచి యువకుడు కుటుంబంతో వచ్చి ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్నాడు. ఏమైందో తెలియదు గానీ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.