సత్యసాయి: మంత్రి సవిత పుట్టిన రోజు వేడుకలు అరుణాచలంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాల్మీకి జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సీగుపల్లి నాగప్ప అరుణాచలంలో మంత్రి సవితను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీగుపల్లి నాగప్ప మంత్రి సవితకు శ్రీ అరుణాచల మహేశ్వర స్వామి చిత్రపటం గిఫ్ట్‌గా అందజేశారు.