MNCL: రైతులు పంటలు వేసే సమయంల అధికారుల సూచనలు తీసుకోవాలని జన్నారం మండలంలోని కవ్వాల్ క్లస్టర్ ఏఈవో అక్రమ్ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. కడెం ఆయకట్టు పరిధిలోని పొలాలకు సాగునీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారన్నారు. వరి నారు నాటడం, నీరు పెట్టడం, ఎరువులు వేయడం వాటిపై సలహాలు తీసుకోవాలన్నారు.