HYD: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ నేడు కీలక భేటీ నిర్వహించనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఆయన బ్రేక్ ఫాస్ట్ సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు భారీ ర్యాలీ చేపట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు.