HYD: GHMC పరిధిలో రోజుకు సుమారు 9,100 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లు ప్రత్యేక సమావేశంలో చర్చించారు. అయితే.. నగర జనాభాను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో వ్యక్తి నుంచి సగటున 680 గ్రాముల చెత్త ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా వేశారు. చెత్త సేకరణ, శాస్త్రీయ నిర్వహణను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు.