PDPL: రోడ్డు నిబంధనలను పాటించడం సామాజిక బాధ్యత అని పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల మున్సిపల్ కార్యాలయంలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు హెల్మెట్, కారు నడిపే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గజ్జి కృష్ణ, సీఐలు పాల్గొన్నారు.