అన్నమయ్య: రాయచోటి జిల్లా కేంద్రంగా కొనసాగి ఉంటే వరిగ గ్రామం అభివృద్ధిలో ముందుండేదని గ్రామ ప్రజలు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పర్యటనలో ప్రజలతో మమేకమైన ఆయన. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం మార్పుతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, పీజీ కేంద్రం వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని గ్రామస్థులు తెలిపారు.