VSP: జీవీఎంసీ 36వ వార్డు చెంగళరావుపేట బజార్లో వెలసిన పోలమాంబ అమ్మవారి పరస ఈనెల 18వ తేదీ నుంచి మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలని సూచించారు.