SKLM: ఇచ్ఛాపురంలో వెలసిన శ్రీకోదండరామస్వామి ఆలయంలో హనుమత్ దర్శనోత్సవ వేడుకలను శనివారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త ప్రత్తి శ్రీలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. ఏటా కనుమ మరుసటిరోజున ఈ వేడుకలు నిర్వహించడం పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయమని ఆమె అన్నారు. పరిసర ప్రాంతాలలోను ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్వామివారి దర్శనానికి రావాలని పిలుపునిచ్చారు.