HYD: సికింద్రాబాద్, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ, చర్లపల్లి తదితర రైల్వే స్టేషన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు RPF సిబ్బంది తెలిపారు. సుమారు 600 మంది సిబ్బందిని మోహరించినట్లు వెల్లడించింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచామని, ఎక్కడికక్కడ గస్తీ నిర్వహిస్తున్నట్లు రైల్వే డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ తెలిపారు.