MNCL: హైదరాబాద్లో ఈనెల 11 నుంచి జరిగిన సౌత్ జోన్ అస్మిత యోగాసన పోటీల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన శ్రీజ, శ్రీహర్షిణి, వైష్ణవి ప్రతిభ కనబర్చినట్లు జిల్లా యోగసన సంఘం అధ్యక్ష, కార్యదర్శులు అక్కల తిరుపతి, మంద శ్రీనివాస్ తెలిపారు. ఈ పోటీల్లో వారు 5వ స్థానంలో నిలిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఎంపికైన క్రీడాకారులను పలువురు అభినందించారు.