VSP: సింహాచల క్షేత్రం భక్తజన సంద్రమైంది. భోగి పర్వదినం సందర్భంగా సింహగిరిపై భక్తుల కోలాహలం నెలకొంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల రైతులు తాము పండించిన నూతన పంటలను స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భోగి మంటలు, ముగ్గుల పోటీలు నిర్వహించారు.