ATP: సింగనమల మండలం తరిమెల పెన్నా నది పరివాహక ప్రాంతంలో జేసీబీలు పెట్టి టిప్పర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇసుక తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.