కృష్ణా: పెనమలూరు (M) గంగూరులో గ్రామ పంచాయితీ కార్యాలయ ప్రాంగణంలో ‘స్వచ్ఛ సంక్రాంతి–స్వచ్ఛ గంగూరు’ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి సంబరాలు సోమవారం నిర్వహించారు. రైతుల పండుగగా ప్రసిద్ధి చెందిన సంక్రాంతి కృషికి గౌరవం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని MLA బోడె ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ కార్యక్రమాలు, ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.