TG: BRS నేతలు ఇష్టానుసారంగా విమర్శిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. సినిమా టికెట్ రేట్ల పెంపుపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. పుష్ప-2 ఘటన తర్వాత బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలని కండీషన్ పెట్టామన్నారు. తాను లేనప్పుడు టికెట్ల పెంపుపై జీవో వచ్చిందన్నారు. CM రేవంత్ మంత్రుల శాఖల్లో తలదూర్చడం లేదన్నారు.