WGL: ఉమ్మడి జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం రంగశాయిపేటలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రారంభమయ్యాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జరుపుతున్న ఈ పోటీలను GWMC కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి ప్రారంభించారు. యువత క్రీడల్లో రాణించి, రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరచాలని ఆయన ఆకాంక్షించారు.