NLG: చిట్యాల మున్సిపాలిటి పరిధిలోని 6వ వార్డు వెంకటాపురంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సోమవారం పర్యటించారు. వార్డుకి సంబంధించిన పలు సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకున్నారు. శివారు ప్రాంతమైనప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ఎమ్మెల్యేతో ఉన్నారు.