AP: రాష్ట్రంలో నిర్మించతలపెట్టిన భారీ రైల్వే ప్రాజెక్టుపై కేంద్రం కార్యాచరణ ప్రారంభించింది. నిడదవోలు-దువ్వాడ మధ్య 205KM మేర 3, 4 రైల్వే లైన్ల నిర్మాణం కోసం.. 5(ఉమ్మడి) జిల్లాల పరిధిలో భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రాజెక్టుతో రవాణా వ్యవస్థ మరింత వేగవంతం కావడంతో పాటు తూర్పు తీర ప్రాంత వాణిజ్యాభివృద్ధితో రాష్ట్ర ఆర్థిక ప్రగతికి బలమైన ఊతం లభిస్తుంది.