MDK: పరిపాలనా సౌలభ్యం కోసం పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో విలీనం చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే సంజీవరెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. సంగారెడ్డికి సమీపంలో ఉండి, జిల్లాతో అనుసంధానం కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాల్గొన్నారు.