ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని పార్డీ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్బంగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ను బుధవారం మాజీ MLA కోనేరు కోనప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించి, గ్రామస్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ యువత క్రీడలలో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.