ASR: వై.రామవరం మండల వ్యాప్తంగా గురువారం సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన గ్రామాల్లో సంప్రదాయ నృత్యాలు, కోలాటంతో గిరిజన ప్రాంతవాసులు రోజంతా కోలాహలంగా గడిపారు. అనేక గ్రామాల్లో గ్రామపెద్దలు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. బోరుపాలెం గ్రామంలో మహిళలు కోలాటం ఆడారు.