NLG: మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయడానికి ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని, అందుకు తన వంతు ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బుదవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఏర్పాటు విషయమై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లా ఏర్పాట్లును ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.