KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. సాయంత్రం వరకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ములకాలపల్లిలో 13.2°C, జగిత్యాల జిల్లా భీమారం మండలం గోవిందారం 13.3°C, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగారం 14.3°C, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్లో 14.5°Cగా నమోదయ్యాయి.