NLG: మహనీయుల స్ఫూర్తితో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో “స్టార్ట్ లైబ్రరీ – సేవ్ లైబ్రరీ” ప్రచార కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రంథాలయాన్ని బుధవారం సందర్శించామని ఫౌండేషన్ ఛైర్మన్ అనుముల శ్రీనివాస్ తెలిపారు. అన్ని గ్రామాల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలని, ఉన్న గ్రంథాలయాల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.