ABD: ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇన్ఛార్జ్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. తాంసి బస్టాండ్ ప్రాంతంలో అబ్దుల్ రషీద్ వద్ద నుంచి సుమారు రూ.8,000 విలువైన 2 చరకాలు, 14 ప్యాకెట్ల చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నామని, దీని వల్ల పక్షులు, ప్రజలకు ప్రాణహాని ప్రమాదం ఉందని హెచ్చరించారు.