PDPL: కమాన్పూర్ మండలం జూలపల్లిలో రూ.25 లక్షల డీఎంఎన్టీ నిధులతో నిర్మించనున్న డైనింగ్ హాల్ పనులకు సర్పంచ్ పోలుదాసరి వనిత, ఏఎంసీ ఛైర్మన్ వైనాల రాజు భూమి పూజ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. డైనింగ్ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు.