VZM: గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో జెడ్పీటీసీ తౌడు బుధవారం 700 మందికి దుస్తులు పంపిణీ చేశారు. ముందుగా తౌడు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గత 15 ఏళ్ల నుంచి సంక్రాంతి పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. వైసీపీ నేతలు బూడి వెంకటరావు, బెల్లాన త్రినాధరావు, పైడిపునాయుడు పాల్గొన్నారు.