VSP: రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాసిరెడ్డి సుశీలమ్మ (91) బుధవారం అనకాపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె కోరిక మేరకు సుశీలమ్మ పార్థివదేహాన్ని విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలకు ఆమె కోడలు జిల్లా ట్రెజరీ అధికారిని సుభాషిణి అందజేశారు. ఆమె కళ్ళు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి అందజేసినట్లు సుభాషిణి తెలిపారు.