మనం రోజూ నిర్మాణ పనుల్లో చూసే ‘జేసీబీ’ (JCB) అసలు పేరు అది కాదు. జేసీబీ అనేది దాన్ని తయారు చేసే కంపెనీ పేరు (Joseph Cyril Bamford) మాత్రమే. ఆ వాహనం అసలు పేరు ‘బ్యాక్హో లోడర్’ (Backhoe Loader). కానీ బ్రాండ్ పాపులారిటీ వల్ల అందరూ దానిని జేసీబీ అనే పిలుస్తుంటారు. ఇండియాలో ఈ యంత్రాలను ‘జేసీబీ ఇండియా లిమిటెడ్’ సంస్థ తయారు చేస్తోంది.